News

ప్రజలు నాలుక చీరేస్తారు


మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్‌ను ఏక వచనంతో సంబోధిస్తే ప్రజలు నాలుక చీరేస్తారంటూ కాంగ్రెస్‌ నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలపై మీరు ఎప్పుడైనా అధ్యయనం చేశారా? అని ప్రశ్పించారు. గద్వాల, జనగామను జిల్లాలు చేయాలని అఖిలపక్ష సమావేశంలో ఎందుకు చెప్పలేదని నిలదీశారు. మీకు సమాధానం చెప్పడానికి సీఎం కావాలా మండల స్థాయి నేతలు చాలు అని అన్నారు. సిరిసిల్లను కూడా జిల్లా చేయాలన్న డిమాండ్‌ ఉందని, కానీ పాలనా సౌలభ్యం కోసం పెద్దపల్లిని జిల్లా చేస్తున్నామని వివరించారు.